Daily Archive: November 9, 2026

లంచం తీసుకుంటూ దొరికిన కీసర ఎస్సై అరెస్టు

కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి కలకలం.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్!ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు.. మారని అవినీతి తీరుకీసర: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ మరోసారి అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. పోలీస్ శాఖలో మరోసారి లంచం వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే…..

కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..!

ప్రతినిధి,నవంబర్ 9 :కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని ప్రశ్నిస్తే అరెస్టులతో అడ్డుకుంటారా అని చారకొండ మండల వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి సిరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి కావలి వెంకటయ్య వికలాంగులకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4000 పెన్షన్ ను రూ.6000 కు పెంచుతామని ఇచ్చిన మాట తప్పిన నేపథ్యంలో, కొడంగల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సోమవారం…

దక్షిణ కాశీకి వెలుగులు..! సొంత నిధులతో లైట్లు ఇచ్చిన సర్పంచ్ సంగీత శేఖర్ రెడ్డి.!

వెల్దండ, నవంబర్ 09 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి పురాతన ఆలయానికి బండోనిపల్లి గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి సోమవారం తన సొంత నిధులతో సుమారు రూ.30 వేల విలువైన ఐమాక్స్ లైట్లను అందజేశారు.కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టుగుండంతో వెలసిన అంబా…

అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా సీఎంఆర్‌ఎఫ్‌.. రూ.20 వేల సాయం అందజేత

అమనగల్, నవంబర్ 09: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అమనగల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలోని మంగల్ కుంట తండాకు చెందిన కేతావత్ లఖ్య నాయక్ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందారు. చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.20 వేల సాయం మంజూరైంది.గోలి శ్రీనివాస్ రెడ్డి…

కష్టకాలంలో మృతుడి కుటుంబానికి అండగా సర్పంచ్.. రూ.3 వేల ఆర్థిక సాయం అందజేత

వెల్దండ,నవంబర్ 09: ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీ కాలనీ, బావి తండాకు చెందిన బద్రు నాయక్ మృతి చెందడంతో పోతేపల్లి గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలిచారు.తన వంతు సహాయంగా రూ.3,000 ఆర్థిక సాయం అందజేసి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు, యువ నాయకులు ఎగిరిశెట్టి శివ, మార్కండేయడు, బుషారాజ మధు,…

నూతన ఈవీ (EV) వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల (EV Vehicles) షోరూంను జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే  మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్  జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, గార్లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని, పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య…

సర్పంచ్ ప్రసాద్ గౌడ్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. అమృతమ్మ కళ్లలో ఆనందం..!

బొల్లంపల్లి,నవంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల ఇంటిలో దీపావళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంకమ్మని కుంట గ్రామానికి చెందిన అమృతమ్మ ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించారు. నూతన గృహంలో పూజలో పాల్గొని దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గూడు లేని నిరుపేదలకు కొండంత అండగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని, పేదల…

బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 9 : మండలంలోని పరడ గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం శ్రీనివాస్ చే కేక్ కట్ కట్టంగూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని శ్రీనివాస్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, నాయకులు పోగుల నర్సింహ్మ, పెద్ది బాలనర్సయ్యగౌడ్, మంగదుడ్ల శ్రీనివాస్, బద్దం శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్, దాసరి సంజయ్…

ప్రజల అవసరమే లక్ష్యం.. సొంత డబ్బులతో అభివృద్ధికి బాట!

రూ.2 లక్షలతో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 9 : పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేయడానికి అని నిరూపించారు కట్టంగూర్ నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత డబ్బులతో రూ.2 లక్షలు వెచ్చించి కోట మైసమ్మ ఆలయం సమీపంలో ఐమాక్స్ లైటు, సీసీ రోడ్డు…

పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు!

జ్ఞాన తెలంగాణ, కాగజ్‌నగర్‌ ప్రతినిధి, నవంబర్‌ 9: పేదల ఇళ్లపై పాలకులు పంజా విసురుతున్నారని, దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలను నిరాశ్రయులను చేయాలని చూస్తే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు. సర్‌ సిల్క్‌ కంపెనీ భూముల్లో ఐదు దశాబ్దాలుగా...