నూతన ఈవీ (EV) వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల (EV Vehicles) షోరూంను జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే  మాణిక్ రావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్  జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, గార్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని, పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని సూచించారు. EV వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి కలిగే మేలుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని షోరూం నిర్వాహకులకు సూచించారు.
ఈవీ వాహనాల వినియోగం పెరగడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందనినూతన ఈవీ (EV) వాహనాల షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు గారు

జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల (EV Vehicles) షోరూంను జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ శివకుమార్  , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, గార్లతో 
కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని, పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాలని సూచించారు. EV వాహనాల వల్ల కలిగే ప్రయోజనాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి కలిగే మేలుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని షోరూం నిర్వాహకులకు సూచించారు.
ఈవీ వాహనాల వినియోగం పెరగడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.వారు పేర్కొన్నారు.

You may also like...