Monthly Archive: September 2026
వెల్దండ సెప్టెంబర్ 14: వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు గారు మానవత్వం చాటుకున్నారు.చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై కల్వకుర్తి మహిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రావు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్ నాయక్…
హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్‌ఐజీ లబ్ధిదారుల విషయంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అర్హత నిర్ధారణ పూర్తయిన వారికి ఈ వారంలోనే ఫ్లాట్ కేటాయింపు పత్రాలు అందించనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్...
హైదరాబాద్ మహానగర ప్రజలకు భారీ ఆశలు కల్పిస్తున్న ప్రతిపాదిత మెట్రో రెండో దశ.. ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి కష్టాల కొండలా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగితాలపై 123 కిలోమీటర్ల విస్తరణ, 86 కొత్త స్టేషన్లు అంటూ భారీ ప్రణాళికను ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అడుగడుగునా అనుమతులు, రైల్వే క్రాసింగ్‌లు,...
తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నత చదువుల కోసం ఆమె 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దీపాదాస్ మున్షీపై ఆరోపణలు చేయించి ఆమెను ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఆయన ఏకపక్ష ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా…
వెల్దండ సెప్టెంబర్ 13: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.ఆర్. కృష్ణన్నను వెల్దండ మండలంలోని బొల్లంపల్లి వాస్తవ్యులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ సత్తురి ఆంజనేయులు గౌడ్ కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కృష్ణన్న సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 13: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గృహాలపై ఉన్న విద్యుత్ తీగల వల్ల ఏళ్లుగా ప్రజలు ప్రమాద భయంతో ఉండేవారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి, గృహాలపై ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలన్నింటినీ తొలగించి,దారి మళ్లించారు. దీంతో ప్రజలకు విద్యుత్ ప్రమాద ముప్పు తప్పినట్లయింది.సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,సర్పంచ్ ప్రసాద్ గౌడ్…
వెల్దండ 13: పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం పెద్ద అండగా ఉందని కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్కు రాజశేఖర్ అన్నారు.వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి మౌనికకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 21 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమె కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తోందని తెలిపారు.అలాగే చెర్కూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన దాసరి బాలయ్య కుటుంబాన్ని…
వెల్దండ : పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నాగర్ కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యులకు కొండంత అండగా ప్రజా ప్రభుత్వం నిలబడిందన్నారు. ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని కోరారు. ఆర్యవైశ్యులు…
వెల్దండ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా నిరుపేద విద్యార్థుల పట్టుదలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తుందని సర్పంచ్ మహిపాల్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థుల పట్టుదల గురించి,విద్య గురించి సర్పంచ్ మహిపాల్ నాయక్ మాట్లాడుతూ..పేదరికం చదువుకు అడ్డు కాకూడదు. జైరాం నాయక్ కుమార్తె గంగోత్రి లాంటి విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదువుతున్నారు. వారికి మనం అండగా నిలబడాలి. ఈ ల్యాప్‌టాప్ ఆమె ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గ్రామంలో ప్రతి విద్యార్థి బాగా చదివి గ్రామానికి,…
జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా దూకుడుగా శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత పర్యటనలో ఉన్న అఫ్గానిస్థాన్ ఈ...