నిరుపేద విద్యార్థులకు పట్టుదలే పునాది – సర్పంచ్ మహిపాల్ నాయక్
- ఎంపీ ఆర్ కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు గౌడ్ - September 14, 2026
- ఎమ్మెల్యే సహకారంతో బొల్లంపల్లిలో విద్యుత్ ప్రమాద ముప్పు తొలగింపు - September 14, 2026
- సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం – మార్కెట్ డైరెక్టర్ రాజశేఖర్ - September 14, 2026
వెల్దండ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా నిరుపేద విద్యార్థుల పట్టుదలే వారి భవిష్యత్తుకు పునాది వేస్తుందని సర్పంచ్ మహిపాల్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా నిరుపేద విద్యార్థుల పట్టుదల గురించి,విద్య గురించి సర్పంచ్ మహిపాల్ నాయక్ మాట్లాడుతూ..పేదరికం చదువుకు అడ్డు కాకూడదు. జైరాం నాయక్ కుమార్తె గంగోత్రి లాంటి విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదువుతున్నారు. వారికి మనం అండగా నిలబడాలి. ఈ ల్యాప్టాప్ ఆమె ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.గ్రామంలో ప్రతి విద్యార్థి బాగా చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. విద్యే మనకు అసలైన ఆస్తి. మా వంతుగా ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం అని అన్నారు.
అనంతరం సేవాలాల్ సేనా జిల్లా అధ్యక్షుడు వి. లక్ష్మణ్ నాయక్ గారు మాట్లాడుతూ విద్యార్థిని గంగోత్రిని అభినందించారు.
