Daily Archive: September 25, 2026

వెంకటాపూర్ గణనాథుడికి తల్లోజు ఆచారి ప్రత్యేక పూజలు

కల్వకుర్తి:గణేష్ నవరాత్రుల సందర్భంగా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలోని గణేష్ మండపాన్ని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ సీనియర్ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆ గణనాథుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.ఆయన వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రామగిరి గ్రామంలో సిలిండర్ పేలి.. వ్యక్తికి గాయాలు

కల్వకుర్తి: మండలంలోని రఘుపతిపేట పరిధి రామగిరి గ్రామంలో సిలిండర్ పేలడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న మిగతా వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం – జూరాల ఆయుకట్ట సాగునీరుతో రైతులకు భరోసా

వనపర్తి /నాగర్ కర్నూల్: జూరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి లభ్యత, ఆయకట్టు అవసరాలపై చర్చించారు.అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తామని తెలిపారు. నీటి లభ్యతను బట్టి వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తామని, వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు…

గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ వెల్దండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సర్పంచ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు శ్రీ సీతారామస్వామి దేవాలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం శ్రీ సాయినగర్ కాలనీలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. శ్రీరామ గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ఆటపాటల కార్యక్రమాల్లో పాల్గొని, సన్మానం…