రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిగురింత పారిజాతకు ఎమ్మెల్యే కసిరెడ్డి అభినందనలు

ఇటీవల రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కల్వకుర్తి గౌరవ ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.1001338318.jpg

హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ భేటీలో, నూతన జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికైన పారిజాత నర్సింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...