వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా
- అనంతగిరి గుట్టల్లో ఘోర బస్సు ప్రమాదం,నలుగురికి చేరిన మృతుల సంఖ్య - October 3, 2026
- వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా - October 3, 2026
- కేబినెట్ ముందుకు కీలక నిర్ణయాలు.. - October 1, 2026

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 3:
వికారాబాద్ జిల్లాలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డికి చెందిన ఓం నమశ్శివాయ ట్రావెల్స్ బస్సు అనంతగిరి గుట్టల ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గుట్టల మధ్య ప్రయాణిస్తుండగా బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. మృతుల సంఖ్య, క్షతగాత్రుల వివరాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు


