అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సంగారెడ్డి :- అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నివాస స్థలాలు మంజూరు చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హత్నూర తహసీల్దార్ పర్వీన్ షేక్ కి వినతిపత్రం సమర్పించారు. గత కొన్నేళ్లుగా హత్నూర మండలంలో జర్నలిస్టులుగా పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నామని ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయామని…
