నేను ఫిర్యాదు చేయలేదు మహిళా కమిషన్ నోటీసులపై బాధితురాలి క్లారిటీ.
- నేను ఫిర్యాదు చేయలేదు మహిళా కమిషన్ నోటీసులపై బాధితురాలి క్లారిటీ. - November 13, 2026
- ఓం నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం - November 12, 2026
- దోహా ఐటీయూ (ITU) సదస్సులో భారత డిజిటల్ విప్లవాన్ని చాటిచెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ - November 12, 2026

హైదరాబాద్:తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి తనకు అందిన విచారణ నోటీసులు, ఆపై జరిగిన పరిణామాలపై ఓ బాధితురాలు తీవ్ర ఆశ్చర్యం మరియు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ అలిదాస్ జాని గారిపై తాను స్వయంగా ఈ నెల 7వ తేదీన ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆమె స్పష్టం చేశారు.
మహిళా కమిషన్ నుండి తనకు అందిన నోటీసులో ఆ ఫిర్యాదు తానే స్వయంగా ఇచ్చినట్లుగా ఉందని, కానీ తాను ఎలాంటి పెటిషన్ ఇవ్వలేదని ఆమె తెలిపారు. ఒకవేళ కమిషన్ సుమోటోగా (Suo Motu) తీసుకుని ఉంటే ఆ విషయం నోటీసులో స్పష్టంగా ఉండాలని, కానీ తన పేరుతో ఫిర్యాదు వచ్చినట్లుగా ఉండటంతో ఈ నెల 11న ఈమెయిల్ ద్వారా కమిషన్ను వివరణ కోరినట్లు వెల్లడించారు.
తాను నేరుగా కమిషన్ చైర్మన్ గారిని కలిసినప్పుడు కూడా "ఈ ఫిర్యాదు ఎవరి ద్వారా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది?" అని ప్రశ్నించినట్లు ఆమె పేర్కొన్నారు. వేరే వాళ్లెవరో తమకు చెప్పారని ఇంటర్వ్యూ చేసినప్పటికీ, అసలు ఈ కంప్లైంట్ ఎవరి దగ్గర నుండి కమిషన్కు చేరిందనే దానిపై తనకు స్పష్టత ఇవ్వాలని కోరారు.
కమిషన్ తనను విచారించినప్పుడు, ఎలాంటి ఆధారాలు, ప్రూఫ్స్ సేకరించకుండా మరియు తాను చెప్పిన వ్యక్తుల వద్దకు వెళ్లి విచారించకుండానే మీడియాకు ప్రకటనలు ఎందుకు ఇచ్చారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేయడానికి కనీసం 15 రోజులు పడుతుందని, కనీసం తాను పేరుపేరునా చెప్పిన వ్యక్తులకు ఫోన్ చేసి కూడా వాస్తవాలు కనుక్కోకుండా తొందరపాటు ప్రకటనలు ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఒక అమ్మాయి అంత ధైర్యంగా బయటకు వచ్చి ఆరోపణలు చేసినప్పుడు దాని వెనుక బలమైన కారణాలు ఉంటాయని, కేవలం ఎవరో ఏదో అన్నారనే ఉద్దేశంతో సరైన విచారణ జరపకుండా ప్రకటనలు ఇవ్వడం తనను తీవ్రంగా బాధిస్తోందని ఆమె పేర్కొన్నారు.
