హైదర్షాకోట్లో గాంధీ జయంతి త్యాగాలను స్మరించుకున్న పూలపల్లి కృష్ణారెడ్డి.
- కిస్మత్పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్ఎస్ నాయకులు. - October 2, 2026
- నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య. - October 2, 2026
- సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి. - October 2, 2026

గండిపేట్:జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదర్షాకోట్ జిహెచ్ఎంసి 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి గాంధీజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింసను ఆయుధంగా చేసుకుని, సత్యాన్ని మార్గంగా ఎంచుకుని, స్వాతంత్ర్య సమరంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన మహాత్మా గాంధీ గారి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల బాగు కోసం గాంధీజీ చేసిన త్యాగాలు అమూల్యమైనవని ఆయన స్మరించుకున్నారు. మహాత్ముడు చూపిన సత్యం, అహింస, సేవ అనే మార్గాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు సాగడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అని పూలపల్లి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
