ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
- కిస్మత్పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్ఎస్ నాయకులు. - October 2, 2026
- నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య. - October 2, 2026
- సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి. - October 2, 2026

రాజేంద్రనగర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టీ. ప్రకాష్ గౌడ్ గారి నివాసంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గాంధీజీ బోధించిన సత్యం, అహింస, మరియు శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
