ఇబ్రహీంపట్నంలో రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.
- కిస్మత్పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్ఎస్ నాయకులు. - October 2, 2026
- నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య. - October 2, 2026
- సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి. - October 2, 2026

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళ్‌పల్లి గ్రామంలో భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన 4.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తమ పేరిట మార్చుకున్నారు.
నకిలీ పట్టాదారు పాసుపుస్తకం:
బొంగ్లూర్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సర్వే నంబర్ 96లో మొత్తం 4.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 4.25 ఎకరాల భూమిని వహీదా బేగం అనే మహిళ పేరిట మార్చేసి, పట్టాదారు పాసుపుస్తకాన్ని కూడా జారీ చేశారు.
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ:
ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతా రెడ్డి స్పందించారు. ఈ భూమి కేటాయింపు ప్రక్రియలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె స్పష్టం చేశారు. ఈ అక్రమాల్లో తనకెలాంటి ప్రమేయం లేదని, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు, ఫోర్జరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. ఈ స్కామ్ వెనుక కొందరు రెవెన్యూ అధికారులు, స్థానిక బ్రోకర్ల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
