పెట్టుబడులపై కాంగ్రెస్ విష ప్రచారం: కిషన్ రెడ్డి

తెలంగాణ: భారత్‌లో పెట్టుబడులు రాకుండా కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏనాడైనా ప్రశంసించారా అని ప్రశ్నించారు. దేశంలో గతంతో పోలిస్తే హింస, అవినీతి, ఉగ్రవాదం, కుల రాజకీయాలు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిపై రాహుల్ గాంధీకి ఉన్న విజన్ ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అవమానించేలా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. దేశ ఆర్థిక ప్రగతికి, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని, అలాంటి పెట్టుబడులకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశ అభివృద్ధి, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై నిర్మాణాత్మక చర్చకు రావాలని ఆయన సూచించారు.

You may also like...