మాదిగ ఉద్యోగుల ప్రమోషన్లకు వినతి

హైదరాబాద్ : మాదిగ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ డా. విశారదన్ మహారాజ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులో మాదిగ ఉద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, పదోన్నతుల విషయంలో అర్హులైన ఉద్యోగులకు సముచిత అవకాశాలు కల్పించాలని వినతిలో కోరారు. మాదిగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఎంప్లాయీస్ జాగృతి సంఘం (MEJ) నాయకులు రవీందర్ (M.V.I), సంతోష్ రాజు, జనార్దన్, భాస్కర్, శ్రీనివాస్, అంబేద్కర్, నాగమయ్య (MEJ రాష్ట్ర కమిటీ), MJS నాయకులు డా. బి. అంజయ్య, రాజ్ కమల్, లింగస్వామి, రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

You may also like...