వీజీ – బీలో పోలెపల్లి గ్రామ ముఖచిత్రం ఆవిష్కరణ
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
- మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల - October 2, 2026
- పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - October 2, 2026

ఆమనగల్లు: మండలంలోని పోలేపల్లి గ్రామపంచాయతీలో విజి-బి గ్రామ కార్యక్రమంలో భాగంగా గ్రామ ముఖచిత్రం, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను చిత్రపటాల ద్వారా కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. గ్రామంలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.గ్రామంలోని ప్రధాన రహదారులైన ఆమనగల్లు రోడ్డు, వెల్దండ రోడ్డుతో పాటు రైతు వేదిక, ప్రాథమికోన్నత పాఠశాల భవనం, గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులను చిత్రపటాల్లో పొందుపరిచారు.అలాగే గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం, ఈదమ్మ తల్లి దేవాలయం, పోచమ్మ దేవాలయం, మైసమ్మ దేవాలయం, జమ్మిచెట్టు, మంగళకుంట చెరువు, తలకుంట, పోలేపల్లి గేట్ కమాన్ పిల్లర్లు, రైస్‌మిల్, ఫంక్షన్‌హాల్, బాబయ్య హోటల్ తదితర ప్రత్యేకతలను కూడా ప్రదర్శించారు.గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పోలేపల్లి ప్రత్యేకతలు, మౌలిక వసతులు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను గుర్తించి వాటిపై చర్చించారు. గ్రామ సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ వెంకటయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు చిన్న జంగయ్య, ఒగ్గు అలివేలు, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
