కల్వకుర్తిలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన
- కల్వకుర్తిలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన - October 1, 2026
- కల్వకుర్తిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం - September 29, 2026
- లింగారెడ్డిపల్లిలో రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం - September 29, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలో రేపు (అక్టోబర్ 2) నిర్వహించనున్న వివిధ అభివృద్ధి, జయంతి కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరుకానున్నారు.
ఉదయం 9 గంటలకు కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.అనంతరం మహబూబ్నగర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ, వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవం, స్వాగత ద్వారాలు (కమాన్) నిర్మాణానికి భూమిపూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.

కల్వకుర్తి, వెల్దండ, చారకొండ మండలాల సర్పంచులు, ఉప సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి కోరారు.
