స్వయం ఉపాధితో యువత ఆదర్శంగా ఎదగాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి
- స్వయం ఉపాధితో యువత ఆదర్శంగా ఎదగాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి - November 11, 2026
- పేదింటి పెళ్లికి పెద్ద మనసుతో అండ.. రూ.20 వేల ఆర్థిక సాయం.! - November 11, 2026
- మానవత్వం చాటుకున్న ఎలిమి శెట్టి నరేష్ రూ.10 వేల ఆర్థిక సాయం.! - November 10, 2026

కల్వకుర్తి నవంబర్ 11: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు శాంతినగర్ కాలనీకి చెందిన నల్లబోలు సాయికిరణ్ నూతనంగా ఏర్పాటు చేసిన ‘కేక్ హౌస్ బేకరీ’ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యా నాయక్, ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పసుపుల జంగయ్య, సురేందర్ రెడ్డి, యాట నరసింహ, శివలింగం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకోవాలని సూచించారు. సాయికిరణ్ తరహాలో వ్యాపారాలు ప్రారంభించి, తాము ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని అన్నారు. స్వయం ఉపాధి రంగంలో ముందుకు వచ్చే యువతకు ప్రభుత్వం, తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ బాబా, ఖాదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలం, కౌన్సిలర్ అనిత శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మల్లయ్య, మంగ్లీ రాములు, విజయ్ రాథోడ్, సురేష్ నాయక్, కృష్ణా నాయక్, కొండల్ రెడ్డి, శ్రీకాంత్, పర్వతాలు, కరీం, శీను నాయక్, మైసయ్య, రఘు, పూసల పరమేష్, మహేష్, సీతా పెద్దయ్య, పురుషోత్తం, నరసింహ, గోల్డ్ రాము, కండే సాయి, ఎంగలి ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.
