మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్:1001337937.jpg

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు మిషన్ భగీరథ పంప్ హౌస్ ను సందర్శించి సమీక్షించారు.

ఈ సందర్భంగా పంప్ హౌస్ వద్ద నీటి సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, పైప్ లైన్ల పరిస్థితి, పంపింగ్ సామర్థ్యం, సరఫరాలో అంతరాయాలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలో పలు చోట్ల తక్కువ ప్రెజర్ తో నీరు రావడం, నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంపై లైన్ మెన్ లు, వాటర్ మెన్ లు, సంబంధిత అధికారులు మరియు సిబ్బందితో వివరంగా చర్చించారు.ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఎక్కడైనా నీటి సరఫరాలో సమస్య తలెత్తితే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...