రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ మళ్లీ సంచలనం ఈసారి రూ. 1.01 కోట్ల భారీ ధర పలికింది.
- రిచ్‌మండ్ విల్లాస్ లడ్డూ మళ్లీ సంచలనం ఈసారి రూ. 1.01 కోట్ల భారీ ధర పలికింది. - September 24, 2026
- కిస్మత్పూర్లో ఘనంగా గణేష్ లడ్డూ వేలం రూ. 2.40 లక్షలకు దక్కించుకున్న ఎలుగని ఉదయ్ కిరణ్ గౌడ్. - September 24, 2026
- కిస్మత్పూర్ గణేశ లడ్డూను రూ. 3.51 లక్షలకు దక్కించుకున్న మాజీ కార్పొరేటర్ లంకల నిఖిలా సంగారెడ్డి - September 23, 2026

బండ్లగూడ జాగీర్ : హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ చతుర్థి వేడుకల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాట ముగిసింది. ఈ ఏడాది ఇక్కడి వినాయకుడి లడ్డూ రూ. 1.01 కోట్ల భారీ ధర పలికింది. విల్లా నివాసితుల మధ్య పోటాపోటీగా సాగిన ఈ వేలంలో 'శక్తిమాన్ టీమ్' గ్రూప్‌గా ఏర్పడి ఈ పవిత్ర ప్రసాదాన్ని దక్కించుకుంది.అయితే, గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి లడ్డూ ధర కొంత తగ్గింది. 2024లో రూ. 1.87 కోట్లు, 2025లో రికార్డు స్థాయిలో రూ. 2.31 కోట్లు పలికిన లడ్డూ, ఈ ఏడాది రూ. 1.01 కోట్లకు చేరింది. 2018లో కేవలం రూ. 25 వేలతో ప్రారంభమైన ఈ వేలం ప్రస్థానం, ఏటికేడు ఊహించని స్థాయికి ఎదుగుతూ వస్తోంది.ఈ వేలం ద్వారా సమకూరిన కోట్లాది రూపాయల నిధులను 'ఆర్పీ దియా చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. విల్లాస్‌లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్లు, స్థానిక పేద కుటుంబాల పిల్లల పాఠశాల ఫీజుల చెల్లింపుతో పాటు, అనారోగ్యంతో బాధపడే పేదలకు ఉచిత వైద్యం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. భక్తికి సామాజిక బాధ్యతను జోడించి రిచ్‌మండ్ విల్లాస్ నివాసితులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
