రేపు కొండాపూర్‌కు డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
- రేపు కొండాపూర్‌కు డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ - August 26, 2026
- విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - August 26, 2026
- నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపాలిటీ చైర్మన్ - August 26, 2026

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో నిర్వహించనున్న ష్యామ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి రేపు ప్రముఖ పోలీసు అధికారి, సామాజికవేత్త డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఐపీఎస్ (వీఆర్‌ఎస్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆగస్టు 27న ఉదయం 11:30 గంటలకు కొండాపూర్ సమీపంలోని ఎంఆర్‌ఓ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
వ్యవసాయ భూములు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ రైటింగ్‌తో పాటు సేల్ డీడ్, అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ, గిఫ్ట్ డీడ్, వీలునామా తదితర సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, ఆదాయపన్ను, స్టాంపింగ్ తదితర ఆన్‌లైన్ సేవలు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల రిజిస్ట్రేషన్ సేవలు, నోటరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రజలకు వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందించడమే లక్ష్యంగా నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాకతో కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కు ప్రజలు, శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
