మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
- లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు - October 2, 2026
- మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - October 2, 2026
- సౌమ్యకు ఎంబీబీఎస్ సీటు: అభినందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి - October 2, 2026
కల్వకుర్తి నియోజకవర్గం :
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం కర్మన్‌ఘాట్‌లో ఘనంగా నిర్వహించారు. భారాస కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారాస సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారితో ఓటు నమోదు చేయించడం, ఇప్పటికే ఓటు హక్కు కలిగిన పట్టభద్రుల వివరాలను సేకరించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, పార్టీని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
