కల్వకుర్తిలో 2 కే రన్ పోటీలు ప్రారంభిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి
- కల్వకుర్తిలో 2 కే రన్ పోటీలు ప్రారంభిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి - August 30, 2026
- పిల్లల సృజనాత్మకత శారీరక ఎదుగుదలపై అవగాహన - August 29, 2026
- రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి - August 29, 2026
*
నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బాలురు, బాలికల కోసం మొదటి 2కే రన్ క్రీడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై, 2కే రన్ క్రీడా పోటీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు, యువ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి అభినందించారు.గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం,కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,పట్టణ మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,క్రీడా సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
