రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి

  • కుత్బుల్లాపూర్: ధూలపల్లి గంగస్థాన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్ కిషోర్ (44) మృతి చెందాడు. బహదూర్‌పల్లిలో తల్లిదండ్రులతో నివసిస్తున్న కిషోర్ కొంపల్లి ఇన్‌స్టామార్ట్‌లో పనిచేస్తున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో ఆర్డర్ డెలివరీకి బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కిషోర్ తలకు తీవ్ర గాయమై, ఎడమ కాలు విరిగింది. తొలుత ఎస్‌వీ ఆసుపత్రికి, అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించగా, ఉదయం 3.15 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...