కోమటిరెడ్డి, హరీష్ రావులను కలిసిన షర్మిల.
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

కోమటిరెడ్డి, హరీష్ రావులను కలిసిన షర్మిల.
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే దీనికి షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు ఈ క్రమంలోనే షర్మిల నేడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రిక అందించారు అలాగే మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుని సైతం షర్మిల ఆయన నివాసంలో కలిశారు తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలని కోరారు.
