ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.!
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి కల్వకుర్తి,నవంబర్ 19: డిండి లిఫ్ట్ ప్రాజెక్టు కారణంగా ముంపు ముప్పు ఎదుర్కొంటున్న ఎరవెల్లి గ్రామం, ఎరవెల్లి తండా ప్రజలు తమ గ్రామాన్ని కాపాడుకోవాలనే డిమాండ్‌తో చేపడుతున్న పాదయాత్రకు యువ నాయకుడు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎరవెల్లి గ్రామస్తులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు.
