వెల్దండలో అభివృద్ధి పనులకు శ్రీకారం..సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026

వెల్దండ:మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు.గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ ఎన్నం భూపతి రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, కుందారం తండా సర్పంచ్ ఘన్య నాయక్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, నాయకులు క్యాసరపు వెంకటయ్య, హమీద్, కృష్ణ ముదిరాజ్, ఎండీ రషీద్, మల్లీశ్వరి రంగనాథం, కొండయ్య, కిష్టల్, శ్రీనివాస్, రమేష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య, బొక్కల శ్రీనివాస్, వెంకటేష్, భరత్ గౌడ్, గజిని శ్రీను, ఈదులపల్లి శ్రీను, రాజు, నాగరాజు, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
