హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక*
- హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక* - November 15, 2026
- విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి - November 14, 2026
- హత్నూర గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభం - November 13, 2026
సంగారెడ్డి:- సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీజేఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముక్కగళ్ల యాదన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ వరిగుంతం శంకర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించి కమిటీ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల గౌరవ అధ్యక్షుడిగా మీనంపల్లి కిషన్ రావు, అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య, ఉపాధ్యక్షుడిగా నాయికోటి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య, సహాయ కార్యదర్శిగా కొండేగల్ల శ్రీధర్, కోశాధికారిగా బక్కోల్ల ప్రతాప్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బ్యాగరి శ్రీహరి, వరిగుంతం శంకర్, ఆవుల మల్లేష్, నీరుడి మనోహర్, తూర్పాటి రమేశ్, బ్యాగరి పద్మారావు, నాయికోటి పవన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
