సింగీతంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ
- జహీరాబాద్ చెరుకు రైతులకు టన్నుకు రూ 5000 మద్దతు మద్దతు ధరపై హామీ! - November 13, 2026
- గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులకు పి. రాములునేత శుభాకాంక్షలు - November 12, 2026
- నూతన వధూవరులను ఆశీర్వదించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు - November 12, 2026
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలో బుధవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సర్పంచ్ శ్రావణి నిరంజన్‌తో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.కేదార్‌నాథ్ పటేల్, మాజీ యూత్ అధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వినయ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రఫీక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
