కమల దళం కోలాహలం.. జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం

403661.jpg

శంషాబాద్ / గండిపేట్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన హేమంగ్ జోషికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయానికి భారీగా తరలివచ్చి ఆయనకు స్వాగతం చెప్పారు.

విమానాశ్రయం నుండి నేరుగా రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు బుర్ర అభినయ గౌడ్ నివాసానికి హేమంగ్ జోషి విందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, యువమోర్చా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్, నాయకులు బుర్ర మహాలింగం గౌడ్, మహేందర్, మల్లారెడ్డి, మల్లేష్ యాదవ్, వంశీ యాదవ్, గోవర్ధన్ రెడ్డి తదితరులతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు403662.jpg

403663.jpg

You may also like...