మదనపల్లెలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన.
- మదనపల్లెలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన. - October 4, 2026
- వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. - October 4, 2026
- ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర: రికర్వ్ ఆర్చేరీలో పసిడి పతకం ముద్దాడిన 17 ఏళ్ల కుంకుమ్ మోహొద్. - October 4, 2026

ఆంధ్రప్రదేశ్ : మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంత్ అంబానీ, మంత్రి నారా లోకేశ్ కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఈ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.40 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, ఆధునిక సాగు విధానాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి బాటలు పడతాయని ప్రభుత్వం వివరించింది.అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అనంత్ అంబానీ మాటలపై స్పందించారు. "అనంత్ అంబానీని మన రాష్ట్ర ముద్దుబిడ్డగా భావిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలి" అని వేదికపై నుంచి ప్రకటించారు.
కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలు మొక్కలు నాటారు. ఉద్యాన రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
