లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

వెల్దండ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు.

ఈ సభలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను వివరించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, నీటిని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా గ్రామంలో ఫార్మ్ పాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న 300 పైగా రకాల స్వయం ఉపాధి అవకాశాలపై గ్రామస్తులకు, యువతకు వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.1001353371.jpg

You may also like...