నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్‌డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య.

291809.png

నార్సింగి: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఒక ఘోర జరుగగా, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యారు.పోలీసుల కథనం ప్రకారం. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్న అనే ఉస్మానియా పీహెచ్‌డీ విద్యార్థిపై కోకాపేట నియో పోలీస్ కురుమ సంఘం భవనం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా బాది కిరాతకంగా చంపేశారు.

ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ హత్యకు గల కారణాలు మరియు నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

You may also like...