సేవాసంకల్ అభియాన్ లో.. అంగం మిలాన్ సేవా
- వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు - October 2, 2026
- మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసా.. విషాదంలో ఊతకర్రలా..ఉప్పల - October 2, 2026
- పేదల సొంతింటి కలను సహకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం - October 2, 2026

లింగాల అక్టోబర్ 1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మండలంలోని అంబటి పల్లి గ్రామంలో అంగన్ మిలన్ సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రజలకు చేరువగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ,సమాజంలో సేవాభావాన్ని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.లింగాల మండల అధ్యక్షుల గువ్వాని నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ తేజస్విని,జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నిషాద ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబటి పల్లి గ్రామ సర్పంచ్ జంబులా శ్రీవాణి అన్ముత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని తమ సహకారాన్ని అందించారు.సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం,గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అవసరమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఇట్లా హేమంత్,ఎస్టి మోర్చా అధ్యక్షులు సురేష్, రామకృష్ణ, ప్రసాద్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
