ఈ నెల 28న అమ్రాబాద్ కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
- మాజీ సర్పంచ్ సోమయ్య గారి జ్ఞాపకార్థం జరుగుతున్న LPL – 6.. ఫైనల్లో డామినేటర్స్, లయన్స్ అమీతుమీ - November 10, 2026
- ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి - November 6, 2026
- వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్యకు ఘన సన్మానం - November 5, 2026
అమ్రాబాద్: ఈ నెల 28న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నల్లమల్ల అమ్రాబాద్ కు రానున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.

మన్ననూరులో రూ. 69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
