వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్యకు ఘన సన్మానం

వెల్దండ: వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ గా మండల కేంద్రానికి చెందిన కొయ్యల పుల్లయ్య నియమితులైన సందర్భంగా లింగారెడ్డి పల్లి గ్రామ ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మండల పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా, వార్డు బాధ్యులు మల్లేపాకుల లాజర్, లింగారెడ్డి పల్లి యువకుడు జోగు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుల్లయ్యకు శాలువా కప్పి, పూలమాల వేసి సన్మానించారు. సింగిల్ విండో డైరెక్టర్ గా నియమితులైన పుల్లయ్య రైతులకు మెరుగైన సేవలు అందించాలని, మండలంలోని రైతాంగానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పుల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు1001399607.webp

You may also like...