బండ్లగూడలో మిన్నంటిన దేశభక్తి ఘనంగా వందేమాతరం 150 వసంతాల ఉత్సవం.

278854.jpg

బండ్లగూడ జాగీర్:బండ్లగూడ జాగీర్‌లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో భారత జాతీయ గేయం "వందేమాతరం" 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా "వందేమాతరం 150" ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు నీరుడు శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వీరేందర్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎల్.వి. సుబ్రమణ్యం, శ్రీ అర్జున్ గౌడ్, అలాగే శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ మరియు ప్రధానాచార్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక వందేమాతరం గాన కార్యక్రమంలో శేఖర్ ముదిరాజ్ చిన్నారులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలు ఆలపించడంతో పాటు నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, దేశభక్తి నినాదాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

You may also like...