బోనాల వేడుకలకు భద్రత.. సీఐ రుద్రవీర్‌కు ఘన సన్మానం

శంకర్ పల్లి మున్సిపాలిటీ 1వ వార్డు భవానీనగర్‌లోని పోచమ్మ తల్లి ఆలయంలో మంగళవారం సాయంత్రం సీఐ రుద్రవీర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మడపతి చంద్రమౌళి, 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ వాకిటోళ్ల గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ శ్రీరాజన్ల వసంత మహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భవానీనగర్ కాలనీ వాసులు సీఐ రుద్రవీర్‌ను ఘనంగా సన్మానించారు. శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం బోనాల వేడుకలకు పటిష్ట భద్రత కల్పించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన సీఐ సేవలను వారు అభినందించారు. ప్రజల భద్రత విషయంలో రాజీ లేకుండా విధులు నిర్వర్తించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...