రూ. 3400 కోట్ల ఎమ్మెల్యే: ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మారిన పరాగ్ షా

252809.jpg

మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు. అంతేకాదు.. రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసి, ఆ భిక్షతోనే భోజనం చేశారు. ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు, సంపద మరియు అధికార అహంకారాన్ని వీడటానికే ఆయన ఈ వినూత్న ప్రయోగం చేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా చిరిగిన బట్టలు, ప్రత్యేక మేకప్‌తో ఘాట్‌కోపర్ వీధుల్లో భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఆయనకు డబ్బులు, ఆహారం ఇవ్వగా, ఆయన సొంత అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కూడా గుర్తుపట్టలేక అక్కడి నుండి వెళ్ళిపోమని గద్దించాడు. మానవత్వాన్ని, సామాన్యుల కష్టాలను ప్రాక్టికల్‌గా తెలుసుకోవడానికే తాను ఇలా చేసినట్లు ఎమ్మెల్యే పరాగ్ షా పేర్కొన్నారు.

You may also like...