ఘనంగా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం

ప్రజల సంక్షేమమే నా లక్ష్యం : కౌన్సిలర్ భానూరు కృష్ణ


శంకర్‌పల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ 5వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బుల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గారెలా లక్ష్మీనారాయణ గారి ఇందిరమ్మ ఇంటిని 5వ వార్డు కౌన్సిలర్ భానూరు కృష్ణ గారు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
నూతన గృహంలోకి ప్రవేశించిన లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి జీవితంలో ఆనందం, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You may also like...

Translate »