Monthly Archive: September 2026
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్ అంటూ ఘాటైన పదజాలంతో విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పాలనను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే పదవుల కోసం...
ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర సంపద కోసం ఎంగిలి విస్తరాకు దగ్గర కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలో ఉన్నవారు స్వప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో...
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి హస్తినలో మకాం వేయగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, అసెంబ్లీ...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (cps) విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ops)విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా...
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGEJAC ఆధ్వర్యంలో TRTF రంగారెడ్డి జిల్లా తరఫున చౌదరిగూడ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. CPS/NPSను రద్దు చేసి OPS పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అరియర్స్‌తో సహా వెంటనే విడుదల...
రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ సెంచరీ కొట్టేలా ఉన్నారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మిర్యాలగూడలో కేటీఆర్ పాల్గొనే రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు దరఖాస్తు చేసుకోగా డీఎస్పీ అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.గత నెలలో బీఆర్‌ఎస్...
అంబర్‌పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బజారు భాష మాట్లాడారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ పాలిట కేసీఆర్...
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ...
వెల్దండ ఆగస్టు 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా సర్పంచ్ మరియు బాలిక కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య యాదవ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు ఎండి సద్దాం, కాలూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.