ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి హస్తినలో మకాం వేయగా, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కీలక నేతలంతా ఒకేసారి ఢిల్లీలో ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానంతో కీలక అంశాలపై చర్చలు, భేటీలు జరిగే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది
