ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGEJAC ఆధ్వర్యంలో TRTF రంగారెడ్డి జిల్లా తరఫున చౌదరిగూడ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. CPS/NPSను రద్దు చేసి OPS పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అరియర్స్‌తో సహా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 2వ PRCను తక్షణమే అమలు చేసి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇకనైనా జాప్యం చేయకుండా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో TGEJAC నాయకులు జామ కుశాల్, బొడ్డు రవి, GHM సునీతా, లీలా మోహన్ నాయక్, మారోజు ప్రకాష్, రాములు, నరేష్‌తో పాటు మండల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
