బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ - September 20, 2026
- బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు - September 20, 2026
- శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం - September 20, 2026
పితృవియోగంతో దుఃఖంలో ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డిని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి
కొల్లాపూర్: సింగోటలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
