నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా – గోలి శ్రీనివాస్ రెడ్డి

1001195948.jpg

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన కలకొండ జ్యోతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.44 వేల చెక్కును తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల ఆరోగ్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాడ్గుల మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, ఫిరోజ్‌నగర్ సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీను, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమళ్ల సుభాష్, నాయకులు సతీష్, సీత మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You may also like...