కళ్ళకు చూపు.. జీవితాలకు వెలుగు – సుంకరెడ్డి సేవకు ప్రశంసలు
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కారంగి బ్రహ్మయ్య భేటీ - September 20, 2026
- బాలాపూర్ గణనాధునికి వంశీచంద్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు - September 20, 2026
- శ్రీ మేరాడమ్మ యాడి ఆలయ నిర్మాణానికి భాస్కరరావు రూ.25 వేల విరాళం - September 20, 2026

కడ్తాల్: పేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాల్లో భాగంగా కడ్తాల్‌లో 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.ఆరు మండలాల్లో నిర్వహించిన శిబిరాల్లో ఇప్పటివరకు 19,791 మందికి కంటి పరీక్షలు, 15,497 మందికి ఉచిత కంటి అద్దాలు, 876 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. కడ్తాల్ శిబిరంలో 3,591 మందికి పరీక్షలు, 2,422 మందికి అద్దాలు, 154 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేశారు.ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులు వైద్యానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. కడ్తాల్ శిబిరం ముగిసినా పేదల కళ్లలో వెలుగులు నింపే సేవకు విరామం ఉండదన్నారు.కార్యక్రమంలో శంకర నేత్రాలయ వైద్యులు విష్ణు భరత్, సూపర్‌వైజర్ భానుప్రకాష్ రెడ్డి, సర్పంచ్ దాస్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించుకున్న లబ్ధిదారులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
