Monthly Archive: August 2026

ట్రంప్ టారిఫ్‌లకు అమెరికాలోనే చట్టపరమైన సవాల్.. 25 రాష్ట్రాల దావా

వాషింగ్టన్, ఆగస్టు 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఇప్పుడు న్యాయపరమైన వివాదానికి దారితీశాయి. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా...

భారత్‌లో 15 విదేశీ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

యూజీసీ నుంచి 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్.. భారత డిగ్రీలతో సమాన గుర్తింపు భారత్‌లో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని...

విద్యార్థుల కేసుల ఎత్తివేతకు రాష్ట్రాలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, ఆగస్టు 4: నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమాయక విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేసింది. అయితే తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారికి ఈ...

సమస్యలపై పోరాటమే లక్ష్యం: సర్వేష్

జ్ఞాన తెలంగాణ, గండిపేట్ మండల ప్రతినిధి, ఆగస్టు 3: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్‌పూర్ గ్రామం 122వ డివిజన్ పరిధిలోని శ్రీ బాలాజీ ఎంక్లేవ్ కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకుడు నీరుడు సర్వేష్ ముదిరాజ్ వెంటనే స్పందించారు. కాలనీవాసులు...

పీజీ సీట్ల కేటాయింపు ప్రారంభం.. నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే!

హైదరాబాద్, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సుల ప్రవేశాల తొలి దశ సీట్ల కేటాయింపును రేపటి నుంచి మూడు విడతల్లో విడుదల చేయనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోపు ట్యూషన్ ఫీజు చెల్లించి,...

విధుల్లో నిర్లక్ష్యం.. సిద్ధిపేటలో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్

జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు.. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హెచ్చరిక సిద్ధిపేట, ఆగస్టు 4 (జ్ఞాన తెలంగాణ): సిద్ధిపేట మల్టీపర్పస్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల బోధన,...

తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన...

రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్

హైదరాబాద్, ఆగస్టు 3: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ హాస్పిటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. త్వరలోనే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు పలు సూపర్ స్పెషాలిటీ...

మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు

హైదరాబాద్, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై అనంతరం మృతిచెందిన రాచకొండ కమిషనరేట్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు. పోలీసు శాఖ తరఫున కుటుంబ సభ్యులకు ప్రగాఢ...

సమన్వయంతోనే ప్రభుత్వ పథకాల సమర్థ అమలు: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,...