మన నేచురల్ డైరీ ప్రారంభించిన చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్

చేవెళ్ల మున్సిపాలిటీ, ఆగస్టు 31: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని చేవెళ్ల విలేజ్‌ రోడ్డులో, పోస్ట్‌ ఆఫీస్‌ పక్కన మన నేచురల్‌ డైరీ నూతన షాప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ దేవర సమత వెంకట్‌ రెడ్డి హాజరై డైరీ షాప్‌ను ప్రారంభించారు. మాజీ సర్పంచ్‌, 15వ వార్డు కౌన్సిలర్‌ బండారి శైలజ ఆగిరెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మన నేచురల్‌ డైరీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ నిర్వాహకులకు మంచి ఫలితాలు అందించాలని కోరారు. స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పడటం వల్ల ప్రజలకు అవసరమైన సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానికులు, డైరీ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా షాప్‌ వద్ద సందడి నెలకొంది.

You may also like...