తక్షశిల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
- ధర్మం నీ వైపు ఉంటే.. ప్రపంచం నీకు ఎదురైనా భయపడకు - September 4, 2026
- కృష్ణుడు నేర్పింది ఒక్కటే.. కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని కాలానికి వదిలేయి - September 4, 2026
- పరిస్థితులు మారకపోతే.. నీ ధైర్యమే పరిస్థితులను మార్చాలి - September 4, 2026

కల్వకుర్తి :వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హైస్కూల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.సుమారుగా 120 మందికి పైగా చిన్నారులు వేషధారణలో పాల్గొని అలరించారు.ఈ సందర్భంగా ఎల్కేజీ,యూకేజీ చిన్నారులు శ్రీకృష్ణుని,గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని జీవితం ఆయన బోధించిన కర్తవ్యనిష్ఠ వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి వేడుకల ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చిన్నారులకు పరిచయం చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
