బొల్లంపల్లిలో కారు అద్దం ధ్వంసం..గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు

1001287798.jpg

వెల్దండ,అక్టోబర్ 21: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుకు చెందిన వెనుక అద్దాన్ని ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ఆలంపల్లి కృష్ణ తన ఇంటి సమీపంలో కారును పార్కింగ్ చేయగా,రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.కారు అద్దం ధ్వంసం కావడంతో బాధితుడు వెల్దండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినప్పటికీ, రాత్రి సమయం కావడంతో నిందితులు స్పష్టంగా కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై విచారణ జరిపి,కారు అద్దాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

You may also like...