భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి.

లేబర్ అడ్డ లో మూత్రశాలల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని మున్సిపల్ కార్యాలయం పక్కన, లేబర్ అడ్డలో మూత్రశాల నిర్మాణం చేయాలి. నటరాజ్ టాకీస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవనాన్ని నిధులు మంజూరు చేయాలని, లేబర్ అడ్డలో మూత్రశాలలను నిర్మించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్ అన్నారు.గత ప్రభుత్వ కాలం లోనూ సంఘానికి భవన నిర్మాణం కోసం అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఈ విషయం పై చాలాసార్లు, అధికారులను, ప్రజాప్రతి నిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. ఎమ్మార్వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌ ను కలిసి సంఘం అవసరాలను వివరించినట్లు భాస్కర్ తెలియజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ ను కూడా కార్మికుల సమక్షం లో కలిసి, భవన మంజూరు, మూత్రశాలల నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశామన్నారు.భవన నిర్మాణ రంగం లో అహర్నిశాలు కష్టపడుతున్న కార్మికులకు సంఘ భవనం అవసరమని, లేబర్ అడ్డలో మూత్రశాలలు లేక కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని అన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల బాధను గుర్తించి, నటరాజ్ టాకీస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో సంఘ భవనానికి నిధులు మంజూరు చేసి, లేబర్ అడ్డ లో మూత్రశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ప్రాథమిక సౌకర్యాలు ప్రభుత్వ దృష్టికి తీసుక రావాలని అన్నారు.ఈ కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్‌ తో పాటు, కార్మిక సంఘం నాయకులు అందే సుదర్శన్, ఎస్.కె. షాదుల్లా, కోడి ముంజ, గంగాధర్, శంకర్, యాకూబ్, రమేష్, శివ, సత్యం, నవీన్, బాల్రాజ్, మహేష్, శ్రీకాంత్, సంజీవ్, రుక్కవ్వ, పోసవ్వ తదితర కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...